శుక్రవారం 05 జూన్ 2020
Badradri-kothagudem - Feb 11, 2020 , 01:15:17

పన్నుల వసూళ్లు వేగవంతం

పన్నుల వసూళ్లు  వేగవంతం

కొత్తగూడెం అర్బన్‌: జిల్లాలోని  కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు  మున్సిపాలిటీలలో ఈ సంవత్సరం నిర్దేశిత పన్ను లక్ష్యాలను సాధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సంవత్సరం పన్నుల వసూలు లక్ష్యాలు భారీగా ఉన్నాయి. వీటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు. పన్నులను సక్రమంగా  చెల్లిస్తున్న వారు కొందరైతే.. మొండి బకాయిదారులు మరికొందరు ఉన్నారు. మున్సిపాలిటీలక ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు దాదాపుగా 50 శాతం వరకు సాధించాయి. మిగతా లక్ష్యాన్ని సాధించేందుకు మున్సిపల్‌ అధికారులు కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూళ్లలో మున్సిపల్‌ అధికారులు కఠినంగా  వ్యవహరిస్తే ఫలితం ఉంటుంది.  నీటి బిల్లులు, ట్రేడ్‌ లైసెన్స్‌లో ఇప్పటివరకు 50 శాతానికి పైగా వసూలు చేసినట్లు అధికారులు చెప్పారు.   

ఈ ఏడాదిలో ఇలా...

  •   ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం పురోగతిలో ఉంది. కొత్తగూడెంలో  రూ.4.42 కోట్ల లక్ష్యానికిగాను ఇప్పటివరకు రూ.2.96 కోట్లు (66 శాతం) వసూలయ్యాయి. ఇంకా రూ.1.46 కోట్లు వసూలు చేయాల్సుంది.  
  •   మున్సిపాలిటీలో రూ.3.70 కోట్ల లక్ష్యానికిగాను ఇప్పటివరకు రూ.2.10 కోట్లు (56 శాతం) వసూలయ్యాయి. ఇంకా రూ.1.60 కోట్లు వసూలు చేయాల్సుంది.
  •   మున్సిపాలిటీలో  రూ.1.06 కోట్ల లక్ష్యానికిగాను ఇప్పటివరకు రూ.85లక్షలు (80 శాతం) వసూలయ్యాయి. ఇంకా రూ.21లక్షలు వసూలు కావాల్సుంది.
  •   రూ.1.71 కోట్ల లక్ష్యానికిగాను ఇప్పటివరకు రూ.60లక్షలు వసూలయ్యాయి. ఇంకా రూ.1.11 కోట్లు వసూలు చేయాల్సుంది. 

95 శాతం సాధించడమే లక్ష్యం 

కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. గత రెండు నెలలుగా మున్సిపల్‌ సిబ్బంది అంతా ఎన్నికల ఏర్పాట్లలో ఉండడంతో           పన్నుల వసూళ్లు కొంత వెనుకబడింది. పాల్వంచ,  మణుగూరు మున్సిపాలిటీలలోనూ పన్నుల వసూళ్లు కొంత మందగించాయి. ఈ మార్చి 31వ తేదీలోపు పన్నులన్నీ చెల్లించాలని ఇంటి యజమానులతో చెబుతామని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఈ నాలుగు మున్సిపాలిటీలలో ఏరియాలవారీగా బిల్‌ కలెక్టర్లను కమిషనర్లు నియమించారు. వారు ఏరియాలవారీగా ఎంత వసూలు చేసిందీ ప్రతీ రోజు సాయంత్రం తెలుసుకుంటామని,   మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు పంపుతామని అధికారులు చెబుతున్నారు. రెండేళ్లకు పైగా పన్నులు కట్టని బకాయిదారుల జాబితాను ఇప్పటికే తయారు చేశారు. వారందరికీ రెండు మూడు రోజుల్లో నోటీసులు పంపనున్నారు. అప్పటికీ పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేసేందుకు సైతం వెనుకాడబోమని మున్సిపల్‌ కమిషనర్లు హెచ్చరిస్తున్నారు.


logo