గురువారం 04 జూన్ 2020
Badradri-kothagudem - Feb 11, 2020 , 01:12:12

గులాబీ పార్టీకే రైతుల మద్దతు

గులాబీ పార్టీకే రైతుల మద్దతు

మణుగూరు, నమస్తే తెలంగాణ: అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, సీఎం కేసీఆర్‌ ఎన్నో రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన సోమవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను దృష్టిలో పెట్టుకొని రైతులందరూ గులాబీ పార్టీకే తమ మద్దతు తెలుపుతున్నారన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతీ కార్యకర్త సహకార ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని, ఇప్పటికే అనేక అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తుందన్నారు. ఒకప్పుడు రైతులు వర్షాలులేక, పండించిన ధాన్యానికి మద్దతు ధర లేక అప్పులు చేసి ఎన్నో బాధలు అనుభవించేవారన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌ రైతుల మొహంలో చిరునవ్వు చూడాలనే ధ్యేయంతో స్వరాష్ట్రంలో బృహత్తరమైన సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. పినపాక నియోజకవర్గంలో రైతులంతా ఒకే తాటిపై నిలబడి సహకార సంఘాలను ఏకగ్రీవం చేస్తున్నారన్నారు. అండగా ఉన్న గులాబీ పార్టీ వైపే రైతులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.


logo