మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 11, 2020 , 01:11:41

ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేయాలి..

ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేయాలి..

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేయాలని జిల్లా కో ఆపరేటివ్‌ అధికారి మైఖేల్‌బోస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం సమావేశ మందిరంలో పోలింగ్‌ అధికారులకు విధివిధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   15న జరగనున్న సహకార ఎన్నికల విధివిధానాలు, నిబంధనలు తెలుసుకోవాలన్నారు. గతంలో ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు మాత్రమే ఈ ఎన్నికల్లో కూడా విధులు కేటాయించడం జరిగిందని, అన్ని సహకార సంఘాల పరిధిలోని మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఒక్కరోజు ఎన్నికల కో ఆర్డినేటర్‌, బ్యాలెట్‌ బాక్సులు ఉపయోగించే తీరు, బ్యాలెట్‌ పేపర్ల వినియోగం గురించి తెలియజేస్తున్నారన్నారు. బ్యాలెట్‌ బాక్సులను ముందుగానే పరిశీలించి పోలింగ్‌ బూత్‌లలో ఏజెంట్ల సమక్షంలో సీల్‌ చేయాలన్నారు. ఎంత మంది ఎన్ని బ్యాలెట్‌ పత్రాలు తీసుకున్నారు, ఎంత మెటీరియల్‌ను బూత్‌లకు తీసుకెళ్తున్నారనేది కచ్చితంగా డైరీ రాయాలని తెలిపారు. పోలింగ్‌ బూత్‌లలో అవసరమైన మెటీరియల్‌ను జిల్లా ఎన్నికల కార్యాలయం నుంచి తీసుకెళ్లాలని, ఎవరి సొసైటీల పరిధిలో ఎన్నికల సిబ్బంది కార్యాలయానికి మెటీరియల్‌ను తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రమేష్‌, ఎన్నికల కో ఆర్డినేటర్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.