సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 11, 2020 , 01:08:36

‘గ్రీవెన్స్‌' దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలి

‘గ్రీవెన్స్‌' దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలి

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : గ్రీవెన్స్‌డేలో వచ్చిన ప్రతి దరఖాస్తును తక్షణం పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రీవెన్స్‌డే నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌డేలో వచ్చిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కావాలని, ఏదేని కారణం చేత మినహాయింపు అవసరమైతే ముందస్తు కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలన్నారు. గత వారంలో వచ్చిన దరఖాస్తులపై మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించబడ్డాయి, విచారణలో ఉన్నవి, పరిష్కరించడానికి అవకాశం లేనివి సమగ్రమైన నివేదికలతో రావాలని చెప్పారు. తక్షణ సమాచారం నిమిత్తం జిల్లా అధికారులకు కలెక్టర్‌ పెట్టే సందేశాలపై అధికారులు స్పందించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించి అధికారులకు ఎండార్స్‌ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌వో లక్ష్మణస్వామి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.