బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 10, 2020 , 00:08:01

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి

బూర్గంపహాడ్‌: స్థానిక సహకార సంఘం కార్యాలయంలో ఆదివారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఈ ప్రక్రియను జేసీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా సందర్శించి, అనంతరం మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాలని సూచించారు. ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, నామినేషన్ల పరిశీలనలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎలాంటి అవకతవకలు, అసౌకర్యాలు లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన యూరియా గోదాంను సందర్శించి రైతులకు రబీ నిమిత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా నిల్వలు సిద్ధం చేయాలన్నారు. మండల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి త్రిమూర్తులు, సొసైటీ సీఈవో ప్రసాద్‌, సొసైటీ సిబ్బంది తిరుపతిరెడ్డి, ఉమర్‌ పాల్గొన్నారు.

దుమ్ముగూడెంలో నామినేషన్ల పరిశీలన

దుమ్ముగూడెం: సహకార సంఘం సొసైటీ కార్యాలయం లో ఆదివారం నిర్వహించిన నామినేషన్ల స్క్రూట్నీని జేఈ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన నామినేషన్లు, స్క్రూ ట్నీలో తిరస్కరణకు గురైన నామినేషన్ల గురించి ఎన్నికల అధికారి నాగమణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.