శుక్రవారం 05 జూన్ 2020
Badradri-kothagudem - Feb 09, 2020 , 02:14:11

నూతన ‘జేకే ఓసీ’కి సన్నాహాలు

నూతన ‘జేకే ఓసీ’కి సన్నాహాలు

ఇల్లెందు నమస్తే తెలంగాణ: జేకే 5 ఓపెన్‌కాస్ట్ట్‌ విస్తరణలో భాగంగా ఏరియా జీఎం పీవీ సత్యనారాయణ, ఫారెస్టు డివిజన్‌ అధికారి అనిల్‌కుమార్‌తో సమావేశమయ్యారు. శనివారం ఇల్లెందు ఫారెస్టు డివిజన్‌ కార్యాలయంలో ఓపెన్‌కాస్టు విస్తీర్ణంలో భాగంగా అటవీ అనుమతుల కోసం ఫారెస్టు అడ్వైజరీ సురేందర్‌పాండేతో సమావేశమయ్యారు. జేకే ఓపెన్‌కాస్ట్‌కోసం జీఎం కార్యాలయం ఆవరణంలో గల 106 హెక్టార్ల అడవి భూమి తదితర విషయాలపై ఫారెస్టు డివిజన్‌ అధికారి అనిల్‌కుమార్‌, సురేందర్‌ పాండేతో చర్చించారు. అందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. జేకే ఓసీ కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో నూతన ఓసీ అమలుకు కావాల్సిన పనులను త్వరితగతిన చేసేంకు సహాయ, సహకారాలు అందించాలని సింగరేణి యాజమాన్యం అటవీశాఖను కోరింది. కార్యక్రమంలో జీఎం ఎస్టేట్‌ కార్పొరేట్‌ సుభాని, ఏజెంట్‌ బొల్లం వెంకటేశ్వర్లు, మేనేజర్‌ ఫారెస్టు బీ హరినారాయణ, పర్యావరణ అధికారి సైదులు, బాలాజీనాయుడు, ఎస్టేట్‌ అధికారి తావుర్యనాయక్‌, సునీత పాల్గొన్నారు. 



logo