గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 06, 2020 , 04:02:09

రాముని హుండీ ఆదాయం రూ.73.38 లక్షలు

రాముని హుండీ ఆదాయం రూ.73.38 లక్షలు
  • గడిచిన 37 రోజుల ఆదాయాన్ని లెక్కించిన సిబ్బంది
  • వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో నరసింహులు
  • కానుకగా 60 గ్రాముల బంగారు ఆభరణాలు

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో చిత్రకూట మండపం నందు బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 37 రోజులకు గాను రూ.73లక్షల 38వేల, 315లు వచ్చినట్లు ఆలయ ఈవో జీ.నరసింహులు తెలిపారు. నగదుతో పాటు బంగారం 60 గ్రాములు, వెండి 600ల గ్రాములు రాగా, యూఎస్‌ డాలర్లు 467, బ్యాంక్‌ ఆఫ్‌ మలేషియా 3 రింగిట్స్‌, ఇంగ్లాండ్‌ ఫౌండ్స్‌ 100, ఖత్తారు రియాల్స్‌ 1000, ఆస్ట్రేలియా డాలర్లు 10, కెనడా డాలర్లు 10, బహ్రెయిస్‌ దీనార్స్‌ 3 వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.