శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 06, 2020 , 04:01:33

భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలి

భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలి

మణుగూరు, నమస్తే తెలంగాణ : మణుగూరు ఆర్టీసీ సురక్షాబస్టాండ్‌ను బుధవారం ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సందర్శించి పరిశీలించారు. వనదేవతల మహాజాతర సందర్భంగా మేడారానికి భక్తుల సురక్షిత ప్రయాణం కోసం మణుగూరు ఆర్టీసీ డిపో నుంచి అవసరమైన బస్సు సర్వీసులు నడపాలని, 24 గంటలు బస్సులు అందుబాటులో ఉంచాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా జాతరకు బస్సు సర్వీసులు నడపాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని డీపో మేనేజర్‌ విజయకుమార్‌కు సూచించారు. మణుగూరు డిపో ఆధ్వర్యంలో 25 సర్వీసులు నడుపుతున్నట్లు డీఎం విజయకుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు ముత్యంబాబు, అడపా అప్పారావు, కుర్రి నాగేశ్వరరావు, బొలిశెట్టి నవీన్‌, పొనుగోటి భద్రయ్య, కొండేరు రాము, హర్ష, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


లయన్స్‌క్లబ్‌ సేవలు అభినందనీయం..

మణుగూరు లయన్స్‌క్లబ్‌ సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన బుధవారం లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో మణుగూరు ఆర్టీసీ సురక్షాబస్టాండ్‌ ఆవరణంలో మహాజాతర మేడారంకు తరలి వెళ్తున్న భక్తులు కోసం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్‌ పిళ్లారిశెట్టి హరిబాబు, గాజుల రమేష్‌కుమార్‌, భూక్యా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.