మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 03, 2020 , 03:41:23

తల్లుల సేవలో ఆర్టీసీ

తల్లుల సేవలో ఆర్టీసీ

ఖమ్మం కమాన్‌బజార్‌: మే డారం సమ్మక్క - సారాలమ్మ అమ్మవార్ల మహాజాతర ఫిబ్రవరి 5న ప్రారం భంకానుంది.  జాతరలో భాగంగా చిలుకల గుట్టపైనున్న సమ్మక్కను ఫిబ్రవరి 6న సాయంత్రం గద్దెపై ప్రతిష్ఠాపన చేస్తారు. ఫిబ్రవరి 7న స మ్మక్క-సారాలమ్మలతో పాటు పగిడిద్ద రాజులు, గోవిం ద రాజులను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఫిబ్రవరి 8న అమ్మవార్ల తిరుగు ప్రయాణంగా వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా భక్తులు మేడా రం జాతరకు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం రవాణా సౌకర్యాలను కల్పించింది. ఈ జాతరకు బస్సులు, రైళ్లు, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ యేడు జరగబోయే మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని ప్రభు త్వం అంచనా వేసింది. మేడారం వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర  రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. భక్తులు వెళ్లేందుకు బస్సులను అందుబాటులో ఉంచుతూ.. వారికి సురక్షితంగా గమ్యస్థానాలుకు చేర్చేందుకు నైపుణ్యం గల డ్రైవర్లకు శిక్షణలు ఇచ్చి విధుల్లో పంపించడం జరిగింది. డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్ల సూచనలు, సలహాల మేరకు బస్సు లను నడుపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆర్టీసీ సంస్థ నుంచి 2 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలంది స్తున్నారు. 800 మంది డ్రైవర్లు, 400 మం ది కండక్టర్లు, 200 మంది వలంటీర్లు 600 మంది ఇతర సిబ్బంది పాల్గొనున్నారు.  డ్రైవర్లకు, కండక్టర్లకు మేడారం జాతరలో క్రమశిక్షణతో ఉంటూ ఓపికతో భక్తులతో మెలిగే విధంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బస్సులు వెళ్లేటప్పుడు మార్గ మధ్యలో ఆపకుండా నేరుగా జాతర వద్దకు వెళ్లే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. రైల్వేశాఖ మేడా రం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను  ఏర్పా టు చేసింది. జిల్లా నుంచి వెళ్లే భక్తులు వరంగల్‌ నుంచి వెళ్లాల్సి ఉం డగా భక్తులు నేరుగా ఆర్టీసీ బస్సులను  ఆశ్రయించి ప్రయాణికులు కొనసా గిస్తున్నారు. 

ప్రత్యేక బస్సులు ప్రారంభం...

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ ఆదివారం నుంచే ప్రత్యేక బస్సులను నడిపింది. మేడారం జాతరకు  ఖమ్మం రీజియన్‌ నుంచి మొత్తం 345 బస్సులకు పైగా నడపాలని నిర్ణయించుకున్న ఆర్టీసీ అధికారులు అందులో భాగంగా ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆర్టీసీ రీజియ న్‌లోని ఆరు డిపోల  నుంచి సుమారు 35 బస్సులను నడిపారు. ఇల్లెం దు రూట్‌లో ఖమ్మం డిపో నుంచి -19,  మణుగూరు డిపో నుంచి -06,బస్సులు, కొత్తగూడెం నుంచి 04, భద్రా చలం డిపో నుంచి -06 బస్సులను నడిపారు. ఆయా బస్టాండ్‌ల ఆవరణలో ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి కౌంటర్‌ల వద్ద సిబ్బంది ఉంటూ మేడారం వెళ్లే భక్తులకు నేరుగా బస్సులలో ఎక్కించి తరలిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్న సమయం లో మందకొడిగా ప్రయాణికులు జాతరకు వెళ్లారు. సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే ఆర్టీసీ బస్సులు నేరుగా అమ్మవారి గద్దెల వరకు భక్తులను దించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రైవే టు వాహనాల ద్వారా జాతరకు వెళ్తే చిన్న భూ పాలెం వద్దనే దింపడం జరుగుతుంది. దీని భక్తులు సుమారు 20 కిలో మీటర్ల వరకు కాలిబాట వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిసే నేరుగా అమ్మవార్ల గద్దెల వరకు ఉన్న కిలో మీటర్‌ వరకు బస్టాండ్‌ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చర్యలు తీసుకున్నారు. మేడారం వెళ్లే భక్తులు రద్దీని అంచనా వేసుకుంటూ బస్సులను పెంచే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

 మేడారం జాతరలో ఆర్టీసీ బేస్‌ క్యాంప్‌...

మేడారం జాతరలో విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైద్యస దుపాయాలను ఏర్పాటు చేసింది. విధుల్లో ఆర్టీసీ ఉద్యోగులకు అత్యవసర సమయంలో వైద్యచికిత్సలు అందించేందుకు మెరుగైన సౌకర్యాలను చేపట్టింది. తెలంగాణ రాష్ట్రలోని 95 డిపోలకు చెందిన బస్సులు మేడారం జాతరకు వెళ్తాయి. ఖమ్మం రీజియన్‌లోని ప్రాంతీయ వైద్యాధికారి డాక్టర్‌ గిరి సింహారావును మేడారం జాతరలో స్పెషల్‌ ఇన్‌చార్జిగా ఆర్టీసీ నియమించింది. రెండు అంబులెన్స్‌లు, ఏడుగురు పారా మెడికల్‌ సిబ్బంది, పది మంది మెడికల్‌ వలంటీర్లను అందుబాటులో ఉంచారు. ఖమ్మం రీజియన్‌లో మేడారం జాతరకు వెళ్లే ఉద్యోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే అంశాలపై సూచనలు చేశారు. జాతరలో ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ఆర్టీసీ బేస్‌ క్యాంపునకు వెళ్లే విధంగా తగు చర్యలు చేపట్టారు. మెడికల్‌ క్యాంపులో అత్యవసర మందులు, అంబులెన్సులో ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు. 

ఆర్టీసీకి ప్రత్యేక రూట్‌లు ఇలా....

  నుంచి వెళ్లే బస్సులు భక్తులకు ఇల్లెందుకు, కొత్తగూడెం బైపాస్‌, పాల్వంచ, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, మేడారం, సమ్మక్క- సారక్క గద్దె.

 ్జదాచలం నుంచి వెళ్లే భక్తులకు .... అశ్వాపురం, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, మేడా రం, సమ్మక్క- సారక్క గద్దె.

  నుంచి వెళ్లే భక్తులకు .... కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, మణుగూరు, మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, మేడారం, సమ్మక్క- సారక్క గద్దె

  నుంచి వెళ్లే భక్తులకు.... మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, మేడారం, సమ్మక్క- సారక్క గద్దె.