గురువారం 04 జూన్ 2020
Badradri-kothagudem - Feb 03, 2020 , 03:31:39

ఘనంగా రామయ్య నిత్య కల్యాణం

ఘనంగా రామయ్య నిత్య కల్యాణం

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు స్వామివారికి అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన, పుణ్యఃవచనం తదితర పూజలు చేశారు.  ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించి సీతమ్మవారి నగలను తిలకించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామునికి నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు.  కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo