ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 01, 2020 , 23:21:32

8న జాతీయ మోగా లోక్‌ అదాలత్‌

8న జాతీయ మోగా లోక్‌ అదాలత్‌

కొత్తగూడెం లీగల్‌: నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా జడ్జి ఎం.లక్ష్మణ్‌ ఆదేశాల మేరకు కొత్తగూడెం కోర్టుల భవన సముదాయంలో జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు ఐదవ అధనపు జిల్లా జడ్జి మహ్మద్‌ అబ్దుల్ఫ్రీ తెలిపారు. మోటార్‌ యాక్సిడెంట్‌ నష్ట పరిహారం కేసులు, సివిల్‌, చెక్‌బౌన్స్‌, వివాహ సంబంధిత ప్రాంశరీ నోటు, ప్రీ లిటిగేషన్‌ బ్యాంక్‌ కేసులు, పీఎల్‌సీ బీఎస్‌ఎన్‌ఎల్‌ కేసులు, క్రిమినల్‌ (రాజీపడదగిన) కేసులను కక్షిదారులు పరిష్కరించుకొని వారి సమయాన్ని, ఖర్చులను వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని, కక్షిదారులు అధిక సంఖ్యలో పాల్గొని పరిష్కరించుకోవాలని కోరారు.