శుక్రవారం 05 జూన్ 2020
Badradri-kothagudem - Feb 01, 2020 , 04:14:24

క్రమశిక్షణతో విధులు నిర్వహించి గుర్తింపు పొందాలి

క్రమశిక్షణతో విధులు నిర్వహించి గుర్తింపు పొందాలి

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయులందరూ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి పాలడుగు సరోజినీదేవి ఆకాంక్షించారు. జిల్లాకేంద్రంలోని సెయింట్‌ మెరీస్‌ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన నాలుగో విడుత నిష్ట శిక్షణ ముగింపు  కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయుల నైపుణ్యాలు పెంపుదల కోసం నిర్వహించిన నిష్ట శిక్షణ విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను ఆమె ధన్యవాదాలు తెలిపారు. విద్యాబుద్ధులు నేర్చిన విద్యార్థులలో ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఇంకా ఎక్కువ మందిని డాక్టర్లుగా, లాయర్లుగా, పోలీస్‌ అధికారులుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. అనంతరం పాఠశాలల హెచ్‌ఎంలకు సలహాలు, సూచనలిచ్చారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్‌, ఎంఈవో జి.వెంకట్‌, సమన్వయ కర్తగా బాలాజీ, లింగయ్య, సుధాకర్‌, శౌరి ఇన్నయ్య, బాబురావు, చంద్రశేఖర్‌, నాగేశ్వరరావు, సీసీవో వనమా సురేష్‌, సహాయకులుగా నగేష్‌, అర్జున్‌, సంపత్‌, నాగరాజులు పాల్గొన్నారు.


logo