మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 01, 2020 , 04:09:24

ఘనంగా రామయ్య నిత్యకల్యాణం

ఘనంగా రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు రామునికి అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన తదితర పూజలు గావించారు. భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, రామాలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియంను సందర్శించి సీతమ్మవారి నగలను తిలకించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామునికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు.  కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.