గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 28, 2020 , 00:15:58

దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..

దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..

మధిర, నమస్తేతెలంగాణ, జనవరి27: మధిర మున్సిపాలిటీ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ మధిరను మధురమైన మధిరగా తీర్చిదిద్దాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. సోమవారం మధిర మున్సిపాలిటీ కార్యాలయంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నిక అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌, వార్డు కౌన్సిలర్లను భార్యభర్తలతో కలిపి పూలమాలలు, శాలువాలతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. భగవంతుడు ఇచ్చిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నీతి, నిజాయితీ గల పాలన అందిస్తూ మధిర అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌తో పాటు, పలువురు వార్డు కౌన్సిలర్లు విద్యావంతులు ఉన్నారని పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆకాంక్ష మేరకు మధిర ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశం ఇచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మధిర మున్సిపాలిటీని అభివృద్ధి పధంలో నడిపిస్తూ, గతానికి భిన్నమైన పాలనను చేపట్టి మధురమైన మధిరగా తీర్చిదిద్దడం జరుగతుందని తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి వంద కోట్లు నిధులను మంజూరు చేస్తారని, ఆ నిధులను సద్వినియోగం చేసి మధిర వైభవాన్ని మార్చడం జరుగుతుందని, పాలకవర్గం పక్షాన తెలియజేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. చైర్‌పర్సన్‌ మొండితోక లత, వైస్‌ చైర్‌పర్సన్‌ యరమల విద్యాలత ఎన్నిక కావడంతో మున్సిపల్‌ కార్యాలయం బయట టీఆర్‌ఎస్‌ నాయకులు,  కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేస్తూ ఆనందోత్సహాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్‌ చావా రామకృష్ణ, వైస్‌చైర్మన్‌ శీలం వీరవెంకటరెడ్డి, ఎంపీపీ మెండెం లలిత, టీఆర్‌ఎస్‌ నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్‌ రంగిశెట్టి కోటేశ్వరరావు, పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు దేవిశెట్టి రంగారావు, అరిగె శ్రీనివాసరావు, రావూరి శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు, కరివేద వెంకటేశ్వరరావు, సుధాకర్‌, శీలం వెంకటరెడ్డి, వీవీ ఆర్‌, కపిలవాయి జగన్మోహన్‌రావు, కనుమూరి వెంకటేశ్వరరావు, డోకుపర్తి సత్యంబాబు, రేగళ్ల సాంబశివరావు, యన్నం కోటేశ్వరరావు, బిక్కి కృష్ణప్రసాద్‌, బత్తుల శ్రీనివాసరావు, తేళ్ల వాసు పాల్గొన్నారు.