శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 27, 2020 ,

మంత్రి పువ్వాడ అజయ్‌కు కేటీఆర్‌ అభినందనలు

మంత్రి పువ్వాడ అజయ్‌కు కేటీఆర్‌ అభినందనలు

 ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం  ఐదు మున్సిపాలిటీలు గెలుచుకున్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అద్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు అభినందించారు.ఆదివారం మంత్రి పువ్వాడ యువనేత కేటీఆర్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.మున్సిపల్‌ ఎన్నికల్లో  ఉమ్మడి ఖమ్మం జిల్లాను స్వీప్‌ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.గెలుపుకు కృషి చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియా నాయక్‌, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవిత, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం, భద్రాద్రి జిల్లా పరిషత్‌ చైర్మన్లు, లింగాల కమల్‌రాజ్‌, కోరం కనకయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ పార్లమెంట్‌ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తాతా మధు, నూకల నరేష్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ బాధ్యులు, ఇంఛార్జిలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. సమష్టిగా పనిచేస్తే విజయం సాధ్యమని మరోసారి నిరూపితమైందన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.