మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 26, 2020 , 00:01:56

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూఓటు హక్కు పొందాలి

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూఓటు హక్కు పొందాలి
  • - కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైనీ
  • - జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో ర్యాలీ, ప్రతిజ్ఞ..

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలంటే 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందాలనికలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైనీ పిలుపునిచ్చారు.10వ జాతీ య ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలోని పోస్టాఫీస్‌ సెంటర్‌లో శనివారం మానవహా రం, ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. సీఈఆర్‌ క్లబ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఓటు చాలా పవిత్రమైందని, మన అభివృద్ధి కోసం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా వినియోగించుకోవాలన్నారు. ఓటు ప్రాధాన్యత, వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జనవరం 25వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు ఆన్‌లైన్‌ ద్వారా కూడా చేసుకోవచ్చని చెప్పారు. ఓటరు నమోదు దరఖాస్తులను పూర్తి చేసి తహసీల్దార్‌ కార్యాలయం,  బూత్‌స్థాయి అధికారికి, ఆయా రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో కానీ అందజేయాలన్నారు. ఎన్నికల సంఘం అన్ని జిల్లా కేంద్రాల్లో ఓటు సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేకంగా 1950 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యతపై వయోవృద్ధులు, విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడించారు. ఎన్నో మెరుగైన సౌకర్యాలు కలెక్టర్‌ నేతృత్వంలో చేశారని, గత ఎన్నికల్లో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం వాహనాలు, పోలింగ్‌ కేంద్రాల్లో వీల్‌ చైర్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు. అనంతరం వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వయోవృద్ధులను కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైనీ శాలువకప్పి సన్మానించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థులకు ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో కనకం స్వర్ణలత, డీఈవో సరోజినీదేవి, తహసీల్దార్‌ రవికుమార్‌, ఎన్నికల డీటీ అంజద్‌పాషా, డీపీఆర్‌వో శీలం శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.