ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 26, 2020 , 00:00:32

హరితహారం లక్ష్యాలను పూర్తి చేయండి

హరితహారం లక్ష్యాలను పూర్తి చేయండి
  • -అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి
  • -రక్షణకు కందకాలు ఏర్పాటు చేయండి
  • - అధికారులకు సీసీఎఫ్‌ ఆదేశం

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ : పచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న హరితహారం కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియో గం చేసుకోవాలని చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టర్‌ పీవీ రాజారావు స్థానిక అధికారులనుఆదేశించారు. వెంట నే హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని, అవసరమైన మొక్కలను నర్సరీలో పెంచాలన్నారు. మండలంలోని వేదాంతపురం, ఊట్లపల్లి సమీపంలో ప్లాం టేషన్‌ పునరుద్ధరణ పనులను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్లాంటేషన్‌లో మొక్కలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది కొత్త ప్లాంటేషన్ల కోసం ప్రతిపాదనలను అందించాలని, అడవుల రక్షణకు సరిహద్దుల చుట్టూ కందకాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా, నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అటవుల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అక్రమ కలప రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని చెప్పారు. అక్కడి నుంచి అశ్వారావుపేట నర్సరీకి చేరుకుని, మొక్కల నాణ్యతను తనిఖీ చేశారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలపై ఆరా తీశారు. మొక్కల పెంపకంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని, నాసిరకం మొక్కలు తీసివేయాలని, వచ్చే ఏడాది కొత్త ప్లాంటేషన్లకు ప్రతిపాధనల మేరకు నాణ్యమైన ఎక్కువ మొక్కలు పెంచాలని ఆదేశించారు. అనంతరం జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ డైరీని ఆవిష్కరించారు. డీఎఫ్‌వో శివాల రాంబాబు, ఎఫ్‌డీవో తిరుమలరావు, రేంజర్‌ ముక్తార్‌ హుస్సేన్‌, డిప్యూటీ రేంజర్‌ శ్రీనివాసరావు, గుగులోతు రమేష్‌ పాల్గొన్నారు.