శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 19, 2020 , 00:40:51

జేఈఈలో హవా..

జేఈఈలో హవా..


న్యూవిజన్‌..

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో న్యూవిజన్‌ విద్యార్థిని ఏ గ్రీష్మ 99.94 పర్సంటైల్‌ సాధించినట్లు చైర్మన్‌ చుంచు గోపాలకృష్ణ ప్రసాద్‌ తెలిపారు. ఈ విద్యార్థులకు డబుల్‌ డిజిట్‌ లోపు ర్యాంక్‌ వస్తుందని వివరించారు. పీ సాయి నమ్రత్‌-99.93, ఎస్‌ సిరిచందన-99.91, కే ఈశ్వర్‌-99.83, టీ మేఘన-99.81,  ఏ వెంకటసాయి రామ తులసి-99.77, పీ సోమశేఖర్‌-99.74, ఆర్‌ శివాణి-99.53, ఎన్‌ స్వర్ణ-99.35, కే అయ్యప్ప-99.28, వై సాయిలోకేష్‌-99.22, టీ త్రినాథ్‌-99.17 పర్సంటైల్‌ సాధించారు. హాజరైన వారిలో 75 శాతం మంది అర్హత సాధించినట్లు వివరించారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా ఏ ఇతర జిల్లాల విద్యార్థులు సాధించని ఘన విజయాన్ని న్యూవిజన్‌ జూనియర్‌ కళాశాల సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను డైరెక్టర్‌ గోపిచంద్‌, ప్రిన్సిపాల్‌ అభినందించారు.

శ్రీచైతన్య...

జాతీయ స్థాయిలో ప్రకటించిన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఫలితాలలో నగరంలోని శ్రీచైతన్య విద్యార్థులు 10లోపు ఆలిండియా ర్యాంక్‌లను సాధించే పర్సంటైల్‌తో రాణించినట్లు సంస్థ చైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌ తెలిపారు. కళాశాలకు చెందిన ఎన్‌ అనుదీప్‌-99.89, రితిహాస్‌-99.87, నితిన్‌-99.79, సాద్‌ తబ్రీజ్‌ పాష-99.74, కౌస్తుభి-99.68, హనీప్‌-99.62, సాయిచరణ్‌-99.49, విజయ్‌ హేమంత్‌-99.46, సాహితీ-99.43, సాకేత్‌-99.12 పర్సంటైల్‌ సాధించినట్లు పేర్కొన్నారు. 90 పర్సంటైల్‌కి పైగా 180మంది స్కోర్‌ సాధించారన్నారు. రాజధానిలోని కార్పొరేట్‌ల్లో చదువుతున్న విద్యార్థులు సైతం సాధించలేని స్కోర్లను సాధరణమైన విద్యార్థులతో సునాయసంగా సాధించినట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన వారిని విద్యాసంస్థల డైరెక్టర్‌ మల్లెంపాటి శ్రీవిద్య, అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సాయిగీతిక, డీజీఎం సత్యనారాయణ, డీన్‌ వర్మ, ఏజీఏంలు చిట్టూరి బ్రహ్మం, గోపాలకృష్ణ, ప్రకాష్‌ అభినందించారు.

హార్వెస్ట్‌...

ఎన్‌టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో హార్వెస్ట్‌ విద్యార్థులు అద్భుతమైన విజయం సాధించినట్లు కరస్పాండెంట్‌ పోపూరి రవిమారుత్‌ తెలిపారు. 110 మంది పరీక్షకు హాజరవ్వగా 40 మందికి పైగా విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించనున్నట్లు పేర్కొన్నారు. 99.25 పర్సంటైల్‌తో కే అనిరుధ్‌ ప్రథమస్థానం, ముఖేష్‌-98.97, బోదేండ్ల శ్రీదివ్య-98.43, లక్ష్మీప్రసన్న-96.68, తేజ్‌కుమార్‌-95.11, రాజాచునాషా-94.62, సమీర్‌-94.43, వంశీ-94.26, ఐశ్యర్య-93.5 పర్సంటైల్‌తో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. 90 పర్సంటైల్‌ పైన 16మంది విద్యార్థులు సాధించారన్నారు. సాధారణ స్థాయి విద్యార్థులను చేర్చుకుని అసాధారణ ఫలితాలను సాధించినట్లు వివరించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌ రామసహాయం పార్వతిరెడ్డి అభినందించారు.

కృష్ణవేణి...

ఎన్‌టీఏ ప్రకటించిన జేఈఈ ఫలితాలలో కృష్ణవేణి కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలకు చెందిన తరుణ్‌-99.74, శ్రీఅన్విత్‌-99.72, ఉదయ్‌కిరణ్‌-99.1, ప్రశాంత్‌కుమార్‌-98.55, నిహారిక-98.21, అభినవ్‌-97.88, గణేష్‌-97.54, హృదయ్‌-96.84, అభిరామ్‌ రాథోడ్‌-96.76, వసంత్‌-95.77, అఫ్రీన్‌-95.55, మోహిత్‌-95.45, సాయిచరణ్‌-95.41, వంశీకృష్ణ-94.5, వినీత్‌-94.5, సాయి నితిన్‌-94.45, శ్రీవర్షిత-94.36, నవ్య-94.3, దీపక్‌-93.63, వైష్ణవి-93.47, భరత్‌సింహారెడ్డి-93.14 పర్సంటైల్‌తో రాణించారు. 150 మంది విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్‌తో అర్హత సాధించారన్నారు. అత్యధిక పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులను కృష్ణవేణి విద్యాసంస్థల అధిపతి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, డైరెక్టర్స్‌ గొల్లపూడి జగదీష్‌, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ రాంచందర్‌రావు, అధ్యాపకులు అభినందించారు.

రెజోనెన్స్‌...

 ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలో రెజోనెన్స్‌ బ 99.39 పర్సంటైల్‌తో సత్తా చాటినట్లు కళాశాల డైరెక్టర్స్‌ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్‌, కొండా శ్రీధర్‌రావు తెలిపారు. హేమంత్‌-99.39, గణేష్‌-98.84, మనోజ్‌సాధ్వీక్‌-97.69,ఈశ్వర్‌రెడ్డి-96.36, దినేష్‌-95.24, జగదీష్‌-95.12, దీప్తి సింధు-94.99, సరిత-92.76, పూర్ణిమ-92.44, కార్తీక్‌-91.83 తోపాటు 80 మంది 90 పర్సంటైల్‌ సాధించినట్లు వివరించారు. పరీక్షకు హాజరైన వారిలో 90శాతంకిపైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. పరీక్షా విధానంలో ఎన్నిమార్పులు చేసినప్పటికీ దానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం ద్వారా అద్భుత విజయాలు సాధించారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు.