మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 19, 2020 , 00:38:56

మున్సిపల్‌ ఎన్నికలు శాంతియుతంగా జరగాలి

మున్సిపల్‌ ఎన్నికలు శాంతియుతంగా జరగాలి
  • - సమీక్ష సమావేశంలో ఎస్పీ సునీల్‌దత్‌కొత్తగూడెం క్రైం : పురపాలక ఎన్నికలను ఎటువంటి సమస్యలకు తావులేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకుని కొత్తగూడెం, ఇల్లెందు సబ్‌డివిజన్‌ల పోలీస్‌ అధికారులతో ఆయన కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా ఎస్పీ సునీల్‌దత్‌ పోలీస్‌ అధికారులతో మాట్లాడుతూ..రానున్న మున్సిపల్‌ ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రాంతాలవారీగా సమస్యాత్మక వ్యక్తులను, రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని వారి వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించాలన్నారు. అధికారులంతా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ  బాధ్యతగా తమ విధులను నిర్వర్తించాలన్నారు. కొత్తగూడెం డీఎస్పీ షేక్‌ మహమ్మద్‌ అలీ, ఇల్లెందు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ చల్లగుండ్ల శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్లు కొండ్రు శ్రీను, లింగనబోయిన ఆదినారాయణ, డీ వేణుచందర్‌, లావుడ్యా రాజు, బత్తుల సత్యనారాయణ, బొడ్డు అశోక్‌కుమార్‌, పోలీస్‌ పీఆర్‌వో దాములూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

బందోబస్తు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేయడం జరిందని జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. ఈ ఎన్నికలను పురస్కరించుకుని శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీన జరుగబోయే పోలింగ్‌కు తగిన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని 36వార్డులకు గాను 149 మంది, ఇల్లెందు మున్సిపాలిటిలోని 24వార్డులకు 156మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో పలు కేసుల్లో నేర చరిత్ర కలిగిన సమస్యాత్మక వ్యక్తులను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తుగా అదపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. రెండు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 162 మందిని బైండోవర్‌ చేయడం జరిగిందని తెలిపారు. బెల్టుషాపులు నిర్వహించే వారిలో 15కేసుల్లో 104మందిని, రౌడీషీటర్లను 17కేసుల్లో 50మందిని, నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. మద్యం, డబ్బు రవాణాను అదుపు చేసేందుకు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 4స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్స్‌ (ఎస్‌ఎస్‌టీ)లను, రెండు ఫ్లయింగ్‌ స్కాడ్‌లను, ఇల్లెందు మున్సిపాలిటి పరిధిలో నాలుగు ఎస్‌ఎస్‌టీ బృందాలను, ఒక ఫ్లయింగ్‌ స్కాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లను మద్యం, డబ్బుతో ఎవరైన ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు కానీ, ఫిర్యాదుల విభాగానికి గాని సమాచారం అందించాలని ఎస్పీ  కోరారు. 22వ తేదీన జరుగబోయే పోలింగ్‌కు మొత్తం 133 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఇల్లెందులో 3పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు.