శుక్రవారం 05 జూన్ 2020
Badradri-kothagudem - Jan 17, 2020 , 00:15:09

ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

ముమ్మరంగా ఎన్నికల ప్రచారం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో దూకుడును పెంచాయి. అధికార టీఆర్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు వార్డులను చుట్టివస్తూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం సంక్రాంతి పండుగ, గురువారం కనుమ ఉన్నా అభ్యర్థులంతా క్షేత్రస్థాయిలోనే ఉంటూ తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు నిర్విరామంగా ఓటర్లను కలుస్తూ తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్ హరిప్రియా నాయక్ ప్రతీ రోజు సాధ్యమైనన్ని వార్డులు తిరుగుతూ ఓపెన్ జీపుపై రోడ్ నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగిస్తూ ముందుకు సాగుతున్నారు.

జోరుగా ప్రచారం

ఈ నెల 14న సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. 15 సంక్రాంతి పండుగ ఉన్నా కొద్ది మంది మాత్రమే పండుగ పనులలో మునిగితేలి, మిగతా అభ్యర్థులందరూ ఓటర్లను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే ప్రచార గడువు ఉండటంతో తిండితిప్పలు మాని తమ వార్డులను చుట్టివస్తున్నారు. వార్డులలో ప్రధానమైన మౌలిక సమస్యలను ఎజెండాగా తీసుకొని వీటన్నింటినీ నెరవేరుస్తామని హామీలిస్తూ అధికార టీఆర్ పార్టీ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. పండుగ జోష్ ఎన్నికలు రావడంతో ఇటు కొత్తగూడెం, అటు ఇల్లెందు మున్సిపాలిటీలు కోలాహలంగా మారాయి.

గత కొన్ని రోజుల నుంచే ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే వార్డులను చుట్టివస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్ రెండు మున్సిపాలిటీ పీఠాలపై గులాబీ జెండాలను ఎగురవేసేందుకు పావులు కదుపుతున్నారు. గెలుపుగుర్రాలకే బీ ఫాంలను అందించిన ఎమ్మెల్యేలు అదే జోష్ ముందుకు సాగుతూ రోజుకు ఆరు, ఏడు వార్డులను చుట్టివస్తూ ప్రత్యక్షంగా ఓటర్లను కలుస్తూ అధికార టీఆర్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధికి బాటలు వేసినట్లవుతుందని చెప్తూ వస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యధిక మెజార్టీని అందించి అభివృద్ధికి బాటలు వేశారని, పట్టణ ప్రాంత ప్రజలు కూడా అధికార పార్టీని ఆదరించి తమ వార్డులను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుతో పాటు జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, టీఆర్ రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేందర్ జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ ఇల్లెందు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఎన్నికల ఇన్ తాతా మధుతో పాటు ఖమ్మం కార్పొరేటర్లు వార్డులను తిరుగుతూ అధికార టీఆర్ పార్టీకి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

టీఆర్ గెలుపు కోసం టీబీజీకేఎస్ ప్రచారం

టీఆర్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీఆర్ అనుబంధ టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కార్పొరేట్ ఉపాధ్యక్షుడు ముప్పాని సోమిరెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ ఆధ్వర్యంలో కార్మికులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి అధికార టీఆర్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీఆర్ పార్టీ తరపున సింగరేణి కార్మికుల సతీమణులు, బందుమిత్రులు పోటీ చేస్తున్న నేపథ్యంలో కార్మికలోకం టీఆర్ మద్దతు తెలపాలని వారు పిలుపునిస్తున్నారు. టీఆర్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం కేసీఆర్ కార్మికులకు అత్యధిక బోనస్ పాటు లాభాల్లో 28 శాతం వాటా ఇచ్చి కార్మికుల పక్షపాతిగా నిలిచారు. అంతేకాకుండా కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ కార్మికులను అక్కున చేర్చుకున్నారని, అటువంటి టీఆర్ పార్టీని అత్యధిక మెజార్టీతో మున్సిపాలిటీలో గెలిపించుకొని కోల్ ఏరియాను అభివృద్ధి చేసుకుందామని వారు సమావేశాలు నిర్వహిస్తూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం అర్బన్ : మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బుధ, గురువారాల్లో పట్టణంలోని 16,17,18,19,21 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఓపెన్ జీపులో అభ్యర్థులతో కలిసి ఆయా వార్డుల్లో తిరుగుతూ ఓటర్లకు అభివాదం చేశారు. టీఆర్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఈ నిధులతో పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టామన్నారు. ప్రజలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వనమా రాఘవేందర్ పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాస్, సుజాతనగర్ ఎంపీపీ బూక్యా విజయలక్ష్మీ, కిలారు నాగేశ్వరరావు, సత్తుభయ్యా, నాగేంద్రత్రివేది, ఆళ్ల మురళి, గుడి కృష్ణ, షరీఫ్ గుమ్మడెల్లి రమణ, బీవీ రామారావు, అజ్మీరా పూర్ణ పాల్గొన్నారు.logo