శుక్రవారం 29 మే 2020
Badradri-kothagudem - Jan 17, 2020 , 00:14:36

ఇల్లెందు మున్సిపాలిటీలో ఖమ్మం కార్పొరేటర్ల ప్రచారం

ఇల్లెందు మున్సిపాలిటీలో ఖమ్మం కార్పొరేటర్ల ప్రచారం


ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో టీఆర్ అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతో ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం కార్పొరేటర్లకు అప్పగించారు. గతంలో హుజూర్ ఉప ఎన్నిక సందర్భంలోనూ ఖమ్మం కార్పొరేటర్లు ప్రచారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరగనున్న కొత్తగూడెం, ఇల్లందు, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలలో పలు వార్డులలో ప్రచార బాధ్యతను కార్పొరేటర్లకు మంత్రి పువ్వాడ అప్పగించారు. ఈ నేపథ్యంలో ఇల్లెందు మున్సిపాలిటీలలో 7,16,17,18,19 వార్డులకు చెందిన ప్రధాన బాధ్యతలను టీఆర్ ఖమ్మం నగర అధ్యక్షులు, 16వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళీకి అప్పగించారు.

ఆయన పరిధిలో 18వ డివిజన్ బాధ్యతలను ఖమ్మం నగరంలోని 39వ డివిజన్ కార్పొరేటర్ పాలడగు పాపారావుకు అప్పగించారు. దీంతో గురువారం ఆయన 18వ డివిజన్ పలు ప్రాంతాల్లో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీఆర్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పట్టణ ప్రజలకు కూడా చేరాలంటే టీఆర్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనకు టీఆర్ అభ్యర్థులను గెలిపించి మద్దతు ఇవ్వాలన్నారు. స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల ద్వారా ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతుందని పాపారావు అన్నారు. ఆయనతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.logo