శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 13, 2020 , 01:36:39

‘ప్రగతి’ స్ఫూర్తిని కొనసాగించాలి

‘ప్రగతి’ స్ఫూర్తిని కొనసాగించాలి


పాల్వంచ రూరల్‌: పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రజలు నిరంతరం కొనసాగించి పల్లెలను పారిశుధ్యానికి ప్రతీకలుగా నిలపాలని జడ్పీ సీఈవో మధుసూదన్‌రాజు అన్నారు. ఆదివారం పల్లెప్రగతి ముగింపు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని తవిశెలగూడెం, పాండురంగాపురం, పాండురంగాపురం తండా, జగన్నాధపురం, రంగాపురం, లక్ష్మిదేవిపల్లి పంచాయతీల్లో   జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తవిశెలగూడెంలో సర్పంచ్‌ రాణి ఆధ్వర్యంలో జరిగిన   గ్రామసభకు హాజరై వారిచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతూ.. రెండోసారి నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యం విషయంలో ప్రజల్లో అవగాహన పెరిగి  పరిశుభ్రతకు పాధాన్యతనిస్తున్నారని, యువత ముందుకొచ్చి ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. గ్రామాల్లోని చెతను డంపింగ్‌ యార్డులకు వెళ్ళేలా అధికారులు, సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాండు రంగాపురంలో తది, పొడి చెత్త బుట్టలను గ్రామస్థులకు అందజేశారు. రంగాపురంలో  జరిగిన గ్రామసభలో సీడీపీవో కనకదుర్గ నివేదన యాప్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ గ్రామసభల్లో సర్పంచ్‌లు జగదీష్‌, విజయ్‌, పద్మ, అనిత, హరి తదితరులు పాల్గొన్నారు.