శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 12, 2020 , 01:43:46

భారీ వాహనానికి తోరణం అడ్డంకి

భారీ వాహనానికి తోరణం అడ్డంకి


పెద్ద యంత్రంతో వస్తున్న భారీ వాహనం శనివారం అశ్వారావుపేటకు చేరుకున్నది. హైద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వైపుగా వెళుతున్న ఈ భారీ వాహనానికి పట్టణ సమీపంలో జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉన్న కాకతీయ తోరణం అడ్డు వచ్చింది. గంటల కొద్దీ వాహనం ప్రధాన రహదారిపై ఆగింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కాకతీయ తోరణం సుమారు 20 అడుగుల మేర ఎత్తు ఉంది. వాహనంపై ఉన్న యంత్రం తోరణం కంటే నాలుగు అంగుళాలు అధికంగా ఎత్తు ఉంది. వాహనం వెళ్లేంత ఎత్తు తోరణాన్ని తొలగించారు. దీంతో వాహనం సులువుగా వెళ్లింది. వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. - అశ్వారావుపేట టౌన్‌