సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 12, 2020 , 01:43:13

ప్లాస్టిక్‌ వినియోగిస్తే భారీగా జరిమానా

ప్లాస్టిక్‌ వినియోగిస్తే భారీగా జరిమానా-ప్రత్యేకాధికారి జినుగు మరియన్న
ఇల్లెందు రూరల్‌, జనవరి 11 : ప్లాస్టిక్‌ వినియోగిస్తే భారీగా జరిమానా విధిస్తామని మండల ప్రత్యేకాధికారి జినుగు మరియన్న స్పష్టం చేశారు. మండలంలోని స్ట్రట్‌పిట్‌బస్తీ గ్రామపంచాయతీలో శనివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై దుకాణ యజమానులకు చైతన్యం కలిగిస్తూ భవిష్యత్తులో వినియోగిస్తే భారీగా జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్‌ సంచులు లభ్యమైన రెండు దుకాణాల యజమానులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ రవి, ఎంపీటీసీ పాయం కృష్ణప్రసాద్‌, కార్యదర్శి పాల్గొన్నారు. ప్రణాళికలో భాగంగా శనివారం పలు గ్రామాలలో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్‌ చీమల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మెట్టెల శిరోమణి, ప్రత్యేకాధికారి జినుగు మరియన్న, కార్యదర్శి షర్మిలబేగం గ్రామస్తులతో కలిసి శ్రమదానం ద్వారా పలు రహదారులను శుభ్రం చేశారు.

సుభాష్‌నగర్‌ గ్రామపంచాయతీలో సర్పంచ్‌ వల్లాల మంగమ్మ, ఉపసర్పంచ్‌ నెలవెల్లి నర్సింహారావు, ఎంపీటీసీ శీలం ఉమ, కార్యదర్శి ఉమామహేశ్వరరావు పలు వీధులలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. మామిడిగూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్‌ తాటి మౌనిక, ఉపసర్పంచ్‌ ప్రసూన, కార్యదర్శి శ్రీకుమార్‌ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నేలను చదును చేయించారు. ఇందిరానగర్‌ గ్రామపంచాయతీలో సర్పంచ్‌ పాయం లలిత, ఎంపీటీసీ మండల రాముమహేష్‌, ప్రత్యేకాధికారి లక్ష్మిప్రసన్న, కార్యదర్శి నాగమణి, ఎఫ్‌బీవో ఈరూలాల్‌ గ్రామస్తులతో కలిసి పిచ్చిమొక్కలను తొలగించారు. బాలాజీనగర్‌ గ్రామపంచాయతీలో సర్పంచ్‌ పాయం స్వాతి, ఉపసర్పంచ్‌ జల్లారపు శోభ, కార్యదర్శి అరుణ, వార్డు సభ్యులు శ్రమదానం ద్వారా పలు వీధులను శుభ్రం చేశారు. విజయలక్ష్మినగర్‌ గ్రామపంచాయతీలో సర్పంచ్‌ పూనెం కవిత, ఎంపీటీసీ పూనెం సురేందర్‌ పలు వీధులలో పారిశుధ్య పనులు చేయించారు. పాఠశాల ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలను గ్రామస్తులతో కలిసి శుభ్రం చేశారు.