మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 12, 2020 , 01:40:04

ముగిసిన నామినేషన్ల పరిశీలన

ముగిసిన నామినేషన్ల పరిశీలన
  • -246లో ఒకటి, ఇల్లెందులో 425లో మూడు పత్రాల తిరస్కరణ
  • -ఉప సంహరణకు అవకాశం
  • -రోజు బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా విడుదల
ఇల్లెందు నమస్తే తెలంగాణ, జనవరి 11: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగిసింది. అభ్యర్ధుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు పరిశీలించి స్క్రూట్నీ చేశారు. ఒకటి నుంచి 24 వార్డులకు సంబంధించిన నామినేషన్లను అధికారులు పరిశీలించారు. మొత్తం ఆరు కేంద్రాలలో నామినేషన్ల పరిశీలన జరిగింది. ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో రెండు, ఎంపీడీవో కార్యాలయంలో రెండు, పంచాయతీరాజ్‌ కార్యాలయంలో రెండు, ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో రెండు మొత్తం ఎనిమిది నామినేషన్‌ కేంద్రాలలో పరిశీలన జరిగింది. ఒక్కొక్క కేంద్రంలో మూడు వార్డుల నామినేషన్ల దరఖాస్తులను పరిశీలించారు. కాగా నామినేషన్‌ మొదటిరోజున ఒకటి, రెండో రోజున 49నామినేషన్లు నమోదయ్యాయి. మూడో రోజు 375నామినేషన్లు దాఖలయ్యా యి. ఒక్కొక్క వార్డుకు ఇండిపెండెంట్లతో కలిపి వివిధ పార్టీ ల నుంచి పది నుంచి పదిహేను నామినేషన్లు దాఖలయ్యా యి. చివరిరోజున నామినేషన్లు పొటెత్తాయి. మొత్తం 270 మంది  425 నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో మూ డు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

నామినేషన్‌ చివరిరోజును పరిశీలిస్తే టీఆర్‌ఎస్‌ 204, బీజేపీ 26, సీపీఐ 13, సీపీఎం 02, కాంగ్రెస్‌ 46, టీజేఎస్‌ 01, టీడీపీ 15, ఇండిపెండెంట్లు 68 మొత్తం 375 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల మొదటిరోజు ఒకటి, రెండో రోజు ఒకటి, రెండో రోజు 49, చివరి రోజు 375 నా మినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 425 నామినేషన్లను ఎ న్నికల అధికారులు పరిశీలించారు. నామినేషన్‌ దాఖలుకు సంబంధించిన వివరాలు ముందే వెల్లడించడంతో అందుకు అవసరమైన ఆధారాలన్ని అభ్యర్థులు సమర్పించారు. ఎక్క డా తిరస్కరణకు గురికాలేదు. 14న నామినేష న్ల ఉపసంహరణ ఉంటుంది. జనరల్‌  వార్డులో ఒకే పార్టీ నుంచి నలుగురైదుగురు బరిలో ఉండడం విశేషం. బీఫాంలు ఎవరికి వస్తే వారే బరిలో ఉంటారు. టీఆర్‌ఎస్‌లో వార్డుకు ము గ్గురు పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో ఒకరికి మాత్ర మే బీఫాం దక్కుతుంది. మిగతా పార్టీలలో రెబల్స్‌ ప్రభావం లే దు. 24వార్డులలో స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం ఉండనుంది.

కొత్తగూడెంలో 245మంది అభ్యర్థులు

కొత్తగూడెం అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం ముగిసింది. శనివారం అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు పరిశీలించి స్క్రూట్నీ నిర్వహించారు. ఇందులో మున్సిపాలిటీలోని 2వ వార్డుకు చెందిన జీ కృష్ణ(బీజేపీ) నామినేషన్‌ పేపర్‌లో ప్రతిపాదించే వ్యక్తిని, ఆ వ్యక్తి సంతకంను చేయకపోవడంతో స్క్రూట్నీలో తొలగించినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అరిగెల సంపత్‌కుమార్‌ తెలిపారు. దీంతో 246మందిలో ఒకరి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను మున్సిపల్‌ కార్యాలయంలో ప్రచురించారు. ఈ నెల 12వ తేదీన నామినేషన్లపై అప్పీలు, 13వ తేదీన అప్పీలుపై తుది నిర్ణయం, 14తేదీన నామినేషన్ల ఉప సంహరణ, అనంతరం పోటీలో నిలిచే తుది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.