శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 09, 2020 , 17:54:59

11న ఎంపీటీసీ సభ్యుల చైతన్య సదస్సు

11న ఎంపీటీసీ సభ్యుల చైతన్య సదస్సు

మామిళ్లగూడెం: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఖమ్మం జిల్లా ఎంపీటీసీ సభ్యుల చైతన్య సదస్సును ఈ నెల 11న ఖమ్మంలోని హోటల్‌ ఎస్‌-పార్క్‌లో నిర్వహించనున్నట్లు ఎంపీటీసీ సభ్యుల సంఘం జిల్లా కన్వీనర్‌ కొండపల్లి శ్రీనివాసరావు(వాసు) ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల ఎంపీటీసీ సభ్యులను పార్టీలకతీతంగా ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. సంఘం రాష్ట్ర ప్రతినిధులు, వివిధ జిల్లాల నాయకులు, పంచాయతీరాజ్‌ చట్టం నిపుణులు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని ఎంపీటీసీ సభ్యులు ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.