ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 09, 2020 , 17:52:24

తొలిరోజు నాలుగు నామినేషన్లు

తొలిరోజు నాలుగు నామినేషన్లు

-కొత్తగూడెంలో రెండు,ఇల్లెందులో రెండు దాఖలు-నామినేషన్‌ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైనీ-స్వీకరణలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌వోలకు సూచన


కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పర్యవేక్షణ చేసేందుకు జిల్లా అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించినట్లు కలెక్టర్‌ రజత్‌కుమార్‌షైనీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు కేటాయించిన విధులలో అలసత్వం వహించకుండా పర్యవేక్షణ చేయాలని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల పర్యవేక్షణకు నియమించబడిన అధికారులు తక్షణం వారికి కేటాయించిన విధులలో నిమగ్నం కావాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు కావాల్సిన వాహనాల కోసం ఆర్డీవోకు నివేదిక అందించాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షణ చేసేందుకు సిబ్బందిని నియమించుకోవడంతో పాటు వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షణ నోడల్‌ అధికారి సుధాకర్‌కు సూచించారు. సూక్ష్మపరిశీలకుల జాబితాను అందజేయాలని లీడ్‌ బ్యాంక్‌ అధికారిని ఆదేశించారు.