e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home ఖమ్మం సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు

సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు

సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు

దళారీ మోసం చేయడంతోనే గంగదేవిపాడు యువకుడి బలవన్మరణం
మృతుడి తల్లిదండ్రులకు అండగా ఉంటాం..
విలేకర్ల సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
బాధిత కుటుంబానికి రూ.లక్ష అందజేత

పెనుబల్లి, జూలై 18: నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా చేసుకొని డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు స్వగృహంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చదువుకున్న యువకులు ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్యలకు పాల్పడటం సరికాదని అన్నారు. గంగదేవిపాడుకు చెందిన నాగేశ్వరరావుకు ఉద్యోగం ఇప్పిస్తాననడంతో అదే గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ ద్వారా ఓ బ్రోకర్‌కు రూ.5 లక్షలు ఇచ్చారని, తీరా ఉద్యోగం రాలేదని అన్నారు. ఇచ్చిన డబ్బులు వస్తాయో, రావోననే మనోవేదనకు గురై నాగేశ్వరరావు ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. సదరు బ్రోకర్‌ను తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. కానీ ఇలాంటి సంఘటనలను ప్రభుత్వంపై రుద్దడం సమంజసం కాదన్నారు. ఇలాంటి దళారులు ఇటీవల నియోజకవర్గంలో తిరుగుతున్నారని, ఇళ్లు ఇప్పిస్తామని, పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని తిరుగుతున్నారని అన్నారు. యుదల వారి బారినపడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కొలువుల జాబితాను ఇటీవలి గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బహిరంగంగా వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు చింతనిప్పు కృష్ణచైతన్య, జడ్పీటీసీల జిల్లా ఫోరం కన్వీనర్‌ చెక్కిలాల మోహన్‌రావు, ఏఎంసీ ఛైర్మన్‌ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్‌, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు కనగాల సురేశ్‌బాబు, సీడీసీ చైర్మన్‌ ముక్కర భూపాల్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్‌, సర్పంచ్‌లు కనగాల జయలక్ష్మి, పంతులి, రాయపూడి మల్లయ్య, చెన్నారావు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి రూ.లక్ష సాయం
ఆత్మహత్యకు పాల్పడిన సానిక నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం పరామర్శించి ఓదార్చారు. జరిగిన సంఘటన బాధాకరమని అన్నారు. చదువుకున్న యువకులు తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలి తప్ప ఇలా ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారు. తన సొంతంగా రూ.లక్ష నగదును ఆర్థికసాయంగా అందించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు
సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు
సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు

ట్రెండింగ్‌

Advertisement