మంగళవారం 04 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 02, 2020 , 11:01:13

'నిబంధనలు అమలుచేస్తే కక్ష సాధింపట'

'నిబంధనలు అమలుచేస్తే కక్ష సాధింపట'

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వైసీపీ ఎంపీ   విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఇవాళ ట్విటర్ వేదికగా పలు అంశాలపై ఆయన స్పందించారు.  'నాన్న ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు మీకోసం వేస్తా అని చెప్పటమే కాదు, ఆ మహానేత తలపెట్టిన బృహత్తర కార్యక్రమాన్ని ఇంకొక అడుగు ముందుకి తీసుకుని వెళుతూ అత్యాధునిక సదుపాయాలతో 108,  104 వాహనాలను యువ ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారని' విజయ సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

 '253 ఎకరాలు భూమి గల్లా వారికి ఇచ్చి పదేళ్లైనా అమరరాజా  ఇన్‌ఫ్రా    దాన్ని నిబంధన ప్రకారం రెండేళ్లలోగా ఫ్యాక్టరీ  పెట్టి 20వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి. అవేమీ జరగక భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పెద్ద, చిట్టీ నాయుళ్లు గుండెలు బాదుకుంటున్నారు. నిబంధనలు అమలుచేస్తే కక్ష సాధింపట.' అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 

ఒప్పందం మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమైన అమరరాజా ఇన్‌ఫ్రా టెక్‌ ఉపయోగించుకోని రూ.60 కోట్లకుపైగా విలువైన 253.61 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo