సోమవారం 13 జూలై 2020
Andhrapradesh-news - May 30, 2020 , 14:31:47

'నెగెటివ్‌ థింకింగ్ పితామహ గడ్డం బాబుని సంప్రదించవచ్చు'

'నెగెటివ్‌ థింకింగ్ పితామహ గడ్డం బాబుని సంప్రదించవచ్చు'

అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శలు చేశారు.  'బతికున్నోళ్లను మభ్యపెట్టడానికి పొగడ్తలతో మునగ చెట్టు ఎక్కించడం చూస్తుంటాం. 25 ఏళ్ళ క్రితం మరణించిన ఎన్టీఆర్ ను భారతరత్న పేరుతో ఆటపట్టించడం ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేయడమే. ప్రతి ఏటా తీర్మానం చేస్తారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడటం నీచాతినీచం.' అని  విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 

'కరోనా కాలంలో కుట్రలు చేయడం ఎలా...అనే విషయంపై ఎవరైనా మాస్టర్ డిగ్రీ/ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఆన్‌లైన్‌  కోర్సులు జూమ్  యాప్ ద్వారా చేయాలనుకుంటే.. మన నెగెటివ్‌ థింకింగ్ పితామహ గడ్డం బాబుని సంప్రదించవచ్చు.'అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.


logo