శుక్రవారం 03 జూలై 2020
Andhrapradesh-news - May 31, 2020 , 15:12:01

'అసలు ఈ సుమోటోలు ఏమిటో...!?'

'అసలు ఈ సుమోటోలు ఏమిటో...!?'

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్లో సెటైర్లు వేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను చంద్రబాబు పరామర్శించకుండా రాష్ట్రం విడిచి వెళ్లిపోవడంపై ఆయన  విమర్శించారు. 

'గ్యాస్ బాధితుల్ని పరామర్శిస్తానని...సుమోటోగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెనక్కి వెళ్ళాడు ఒకాయన. నాకు నేనే సుమోటోగా ఎన్నికల కమిషనర్ని అని ఆర్డర్ ఇచ్చుకున్నాడు ఇంకొకాయన. అసలు ఈ సుమోటోలు ఏమిటో...!?' అని విజయ సాయిరెడ్డి ప్రశ్నించారు. 

'జగన్  సీఎంగా బాధ్యతలు స్వీకరించాక నిరుద్యోగులకు మనో ధైర్యం కల్పించారు. ప్రతి ఏటా ఉద్యోగ నియామకాలుంటాయని భరోసా ఇచ్చారు. 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారు. 52 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకున్నారని' ఆయన వివరించారు.  


logo