శుక్రవారం 03 జూలై 2020
Andhrapradesh-news - May 27, 2020 , 15:34:02

'కరోనా భయంతో నిద్ర కూడా పోవడం లేదంట'

 'కరోనా భయంతో నిద్ర కూడా పోవడం లేదంట'

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ  రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి బుధ‌వారం మరోసారి ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు.  చంద్రబాబు  రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టడంపై  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

'వయస్సు పైబడింది కదా. కరోనా భయంతో నిద్ర కూడా పోవడం లేదంట. ఆయన కోసం దగ్గర్లోని ఓ ఆస్ప‌త్రి  యాజమాన్యం వెంటిలేటర్ కూడా సిద్ధంగా పెట్టిందని సమాచారం. కంగారు పడొద్దు. ఏ పౌరుడికి ఆపద వచ్చినా సీఎం జగన్  మోహ‌న్ రెడ్డి ఆదుకుంటారు. కాకపోతే వరసగా రెండో ఏడాదీ మహానాడు జరపలేక పోవడమే పెద్ద విషాదం.' అని విజ‌య సాయిరెడ్డి పేర్కొన్నారు. క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏపీ టీడీపీ ఆఫీసు నుంచి ఆన్‌లైన్‌లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.


logo