మంగళవారం 11 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 07, 2020 , 17:41:36

రేపు ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌

రేపు ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌

అమరావతి: దివంగత నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  కడపకు బయలు దేరారు. ఇడుపులపాయలో తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్మారకం చోట బుధవారం నివాళులు అర్పించిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ‌ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అక్కడి నుంచి విజయవాడకు చేరుకుని స్వరాజ్‌ మైదానంలో 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహానికి శంకుస్థాపన చేయనున్నారని   ఏపీ మంత్రి విశ్వరూప్‌ తెలిపారు. స్వరాజ్‌ మైదానం పేరును అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదానంగా మార్పు చేయనున్నామని  వెల్లడించారు. మైదానంలోని 25 ఎకరాలను ఉద్యానవనంగా మారుస్తామని ఆయన ప్రకటించారు.  


logo