శనివారం 23 జనవరి 2021
Andhrapradesh-news - Nov 30, 2020 , 16:44:01

CBN అంటే క‌రోనాకు భ‌య‌ప‌డే నాయుడు: సీఎం జ‌గ‌న్

CBN అంటే క‌రోనాకు భ‌య‌ప‌డే నాయుడు:  సీఎం జ‌గ‌న్

అమ‌రావ‌తి:నివ‌ర్ తుపానుతో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప్ర‌తిప‌క్ష‌నేత‌గా చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించ‌లేద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విమ‌ర్శించారు.  క‌రోనాకు భ‌య‌ప‌డి చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లోనే కూర్చున్నార‌ని  మండిప‌డ్డారు. అసెంబ్లీలో మాత్రం ఎల్లో మీడియా క‌వ‌రేజ్ కోసం డ్రామాలాడుతున్నారని ఆరోపించారు.  సీబీఎన్ అంటే క‌రోనాకు భ‌య‌ప‌డే నాయుడు అంటూ అభివ‌ర్ణించారు.    చంద్ర‌బాబుని డ్రామా నాయుడు అంటూ జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. స‌భ‌లో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన‌తీరుపై జ‌గ‌న్ గ‌ట్టిగా స‌మాధానమిచ్చారు. 

అసెంబ్లీలో జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ.. 'రైతుల‌కు ప్ర‌భుత్వం చేసిన మంచిని ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకే అసెంబ్లీలో చంద్ర‌బాబు డ్రామా. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం వివ‌రణ ఇచ్చింది. రామానాయు‌డు మాట‌ల‌ను చంద్ర‌బాబు అడ్డుకుని రెచ్చిపోయారు.  ఐదేళ్లు నేను ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎప్పుడూ పోడియం వ‌ద్ద‌కు రాలేదు. రాజ్యాంగ నిబంధ‌న‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల్సిందే. రైతుల‌కు సీఎం ఏం చేశార‌న్న‌ది ప్ర‌ధానాంశం కాకుండా బాబు రాద్ధాంతం చేశారని' జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 


logo