మంగళవారం 02 మార్చి 2021
Andhrapradesh-news - Jan 22, 2021 , 16:12:58

ప్రేమోన్మాది ఘాతకం.. యువతిపై కత్తితో దాడి

ప్రేమోన్మాది ఘాతకం.. యువతిపై కత్తితో దాడి

అమరావతి :  కడప జిల్లా ప్రొద్దుటూర్‌లో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించేందుకు నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి హతమార్చేందుకు యత్నించాడు. ప్రొద్దుటూర్‌లోని వివేకానంద కాలనీకి చెందిన సునీల్‌ అనే యువకుడు నేతాజీనగర్‌కు చెందిన యువతి (17)ని ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. 3 నెలలుగా అతడి వేధింపులను యువతి ఒపిగ్గా భరిస్తూ వచ్చింది.

ఇటీవల ప్రేమించనని సునీల్‌కు ఆమె తెగేసి చెప్పడంతో కోపం  పెంచుకున్నాడు.‌ ఇవాళ ఎవరూ లేని సమయంలో యువతి ఇంటికి వచ్చి కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు.  దాడిలో యువతి చేతి వేళ్లు కొన్ని తెగిపోయాయి. స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రొద్దుటూర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మూడు నెలలుగా   సునీల్‌‌ తమ కూతురిని వేధిస్తున్నట్లు యువతి కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo