గురువారం 28 జనవరి 2021
Andhrapradesh-news - Dec 05, 2020 , 16:51:34

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

 రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

అమరావతి:  రూ.లక్ష లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)కి చిక్కాడు విఆర్ఓ. విఆర్ఓ గంగాధర్ చిత్తూరు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బసినికొండ విఆర్ఓ గా పనిచేస్తున్న గంగాధర్ ఓ రైతు నుంచి రూ.లక్ష  నగదు తీసుకుంటూ ఏసీబీ కి అడ్డంగా దొరికిపోయాడు. రామకృష్ణ అనే రైతు నుంచి భూమికి సంబంధించి ఆన్ లైన్ నమోదు కోసం విఆర్ఓ గంగాధర్ రూ.లక్ష డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రైతు రామకృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.దీంతో శనివారం ఏసీబీ అధికారులు అతను వల పన్నిపట్టుకున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo