శనివారం 26 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 13, 2020 , 20:31:41

రేపటి నుంచి శ్రీశైల దేవస్థానంలో దర్శనాలకు అనుమతి

రేపటి నుంచి శ్రీశైల దేవస్థానంలో దర్శనాలకు అనుమతి

కర్నూలు: శ్రీశైలమహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు  రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు. 10 ఏండ్ల వయసు నుంచి 65 ఏండ్ల వయసులోపు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, అలాగే భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.


logo