బుధవారం 27 జనవరి 2021
Andhrapradesh-news - Oct 27, 2020 , 16:21:55

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలు విడుద‌ల‌

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలు విడుద‌ల‌

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ పరీక్ష ఫలితాలను క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్ విడుదల చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయితీరాజ్, మున్సిపల్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.

జిల్లాల వారీగా రిజర్వేషన్లతో కూడిన ర్యాంకుల ఆధారంగానే ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 కేటగిరీలలో మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌ను జారీ చేశారు. సెప్టెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాత పరీక్షల నిర్వ‌హ‌ణ జ‌రిగింది. రాష్ట్రవ్యాప్తంగా 10,57,355 మంది అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 7,69,034 మంది ప‌రీక్ష‌కు హాజరయ్యారు.logo