మంగళవారం 04 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 07, 2020 , 11:27:00

'ఇంకెంత దిగజారతావు? 2024లో నీ అడ్రస్ గల్లంతే..!'

'ఇంకెంత దిగజారతావు?  2024లో నీ అడ్రస్ గల్లంతే..!'

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో  అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రతిపక్షనేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శించారు.    పేదలకు తమ ప్రభుత్వం మంచి చేస్తుంటే  చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన ట్విటర్లో  ఆరోపించారు.  

'జగన్  ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే నిరసనలకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్‌లో  ఉంటూ  జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం.  ఇంకెంత దిగజారతావు బాబూ? 2024లో నీ అడ్రస్ గల్లంతే.' అని ఆయన ఎద్దేవా చేశారు. 

'విశాఖ గ్యాస్ లీక్ కేసులో హై పవర్ కమిటీ  నివేదిక  వచ్చాక పచ్చ బ్యాచ్ నోళ్లు  మూతపడ్డాయి. కంపెనీదే తప్పని  నిపుణులు తేల్చారు.  తప్పు ఎవరు చేసిన  మూల్యం  చెల్లించుకోవాల్సిందే అన్నారు సీఎం. కమిటి ఇచ్చిన  సూచనలను  తప్పక  పాటిస్తారు. అందుకే పారదర్శకంగా   నివేదికను జనం ముందుంచారని' విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 


logo