మంగళవారం 04 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 04, 2020 , 15:08:17

'ప్రతిదానికి కులం కార్డేనా బాబూ!'

'ప్రతిదానికి కులం కార్డేనా బాబూ!'

అమరావతి:   హత్యకేసులో టీడీపీ నాయ‌కుడు కొల్లు ర‌వీంద్ర  అరెస్టైతే   టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ర‌చ్చ చేస్తున్నార‌ని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.   చంద్రబాబు   ప్రతి దానికి కులం కార్డు తేవడంపై  విజయసాయిరెడ్డి  ట్విటర్లో మండిపడ్డారు. 

'మర్డర్ కేసులో ఒక టీడీపీ నాయకుడు అరెస్టైతే బీసీలపై దాడంటూ అర్థ రాత్రి ఫోన్లు చేసి రచ్చ చేస్తున్నాడు నాయుడు బాబు. హత్యకు గురైన భాస్కర రావు బీసీ కాదా? బాధితునికి న్యాయం చేయాలంటూ వేలాది మంది బీసీ మహిళల ధర్నాలు కనిపించడం లేదా?  ప్రతిదానికి కులం కార్డు ఏంటి బాబు.' అంటూ ట్వీట్‌ చేశారు. 

'ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ హాస్పిటళ్లను ఎలుకలకు వదిలేసి కార్పోరేట్ ఆసుపత్రులను ప్రమోట్ చేశాడు బాబు. పొరుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తించదని జిఓలిచ్చింది అందుకే.  1800 అంబులెన్సులు కొన్నానని బుకాయిస్తున్నాడు. గుట్టలుగా మూలకు పడిన 108 వాహనాల ఫోటోలను ప్రజలంతా చూశారని' విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo