ఆదివారం 07 మార్చి 2021
Andhrapradesh-news - Jan 04, 2021 , 14:46:14

రామతీర్థం రామునితో రాజకీయాలు చేస్తావా?

రామతీర్థం రామునితో రాజకీయాలు  చేస్తావా?

అమరావతి:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం, కోదండరామస్వామి అలయంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటనలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో  మతాల మధ్య చిచ్చుపెట్టాలని  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని   వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. 

'శ్రీరాముని విగ్రహన్ని మీరు, మీ గ్యాంగ్ ధ్వంసం చేసి ఆ విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటనలేంటి బాబూ? రామతీర్థం రామునితో రాజకీయాలు  చేస్తావా? ఎన్ని చేసినా నువ్వు రావణాసురునివే. జనం ఛీదరించుకోవడంతో ఇప్పుడు మతాల మధ్య మారణహోమం సృష్టించాలని అనుకుంటున్నావా ?' విజయసాయిరెడ్డి ఆరోపించారు. 

'చంద్రబాబు విధ్వంసకర రాజకీయాలు చేస్తుంటే మన సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  సంక్షేమ సేద్యం చేస్తున్నారు. వ్యవసాయ రంగ మౌలిక వసతుల కల్పనకు 10,300 కోట్లతో రసాయనాలు తగ్గించేందుకు ప్రతి గ్రామంలో 3 బయోఫెర్టిలైజర్‌ ఉత్పత్తి కేంద్రాలు, ప్రతీ నియోజకవర్గంలోనూ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నారని' విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

VIDEOS

logo