గురువారం 26 నవంబర్ 2020
Andhrapradesh-news - Sep 06, 2020 , 13:17:59

'అబద్దం నడిచొస్తే చంద్రబాబులా ఉంటుంది'

'అబద్దం నడిచొస్తే చంద్రబాబులా ఉంటుంది'

అమరావతి:    టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై  వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విటర్‌  వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యవసాయ విద్యుత్తు నగదు బదిలీ పథకం పేరుతో విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేసిన  నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు. 

'అబద్దం నడిచొస్తే చంద్రబాబులా ఉంటుంది. దీనికి తాజా నిదర్శనం.. కోట్లాది ప్రజల సమక్షంలో ఉచిత విద్యుత్ పై మహానేత రాజశేఖరరెడ్డి  సీఎంగా చేసిన తొలి సంతకంపై కూడా అబద్దమాడేశారు చంద్రబాబు. నీ అబద్దాలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు  'ఛీ'బిఎన్. నీయంత చరిత్రహీనుడిని ఈ దేశం చూడలేదు, చూడబోదు.'  అంటూ  విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.