శుక్రవారం 03 జూలై 2020
Andhrapradesh-news - May 20, 2020 , 18:18:58

'70 ఏళ్లు దాటాయి కాబట్టి కేసులు వద్దంటే కుదరదు'

'70 ఏళ్లు దాటాయి కాబట్టి కేసులు వద్దంటే కుదరదు'

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మరోసారి  ట్విటర్‌ వేదికగా సెటైర్లు వేశారు. 'వయసుతో పాటు హుందాతనం, బుద్ధి, జ్ఞానం పెరగాలి. పచ్చ వైరస్ సోకిందని చట్టాలు వదిలేయవుగా. వయసు చూసైనా వృద్ధురాలిని వదిలేయాలని వకాల్తా పుచ్చుకున్న బాబు, కొంపదీసి రేపు తన విషయంలో కూడా మాఫీ అడుగుతాడేమో. 70 ఏళ్లు దాటాయి కాబట్టి కేసులు వద్దంటే కుదరదు బాబూ.'అంటూ  ఆయన ట్వీట్‌ చేశారు.

'రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచడం లేదు. వీళ్లు 20 లక్షల ఎక్స్ గ్రేషియా డిమాండ్ చేస్తే సీఎం  కోటి ఇస్తారు. వీళ్లకు ఆలోచన మెదిలే లోపే ఆయన అమలు చేస్తున్నారు. గొప్ప సలహా ఏదైనా ఇస్తే, పాటించకూడదని పట్టుదలకు పోయే స్వభావం కాదాయనది. కాని వీళ్లకు ఆ స్థాయి ఏదీ?' అంటూ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.


logo