ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి..తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అందాల భామ సమంత. స్టార్ హీరోలతో నటిస్తూ వన్ ఆఫ్ ఆది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సామాజిక కార్యక్రమాలకు టైం కేటాయిస్తుంది. సమంత ఓ లేడీ ఆటోడ్రైవర్ కు నేనున్నానంటూ అండగా నిలిచింది.
తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కవిత అనే మహిళపై ఏడుగురు అక్కాచెల్లెళ్ల బాధ్యత పడ్డది. కవిత ఆర్థిక సమస్యలతో తన కుటుంబాన్ని పోషిస్తోంది. కవిత పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న సమంత ఆమెకు రూ.12.5 లక్షల విలువైన కారును అందించి..గొప్ప మనసు చాటుకుంది. కవిత ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా క్యాబ్ సర్వీసును నడుపుకుంటూ జీవనం సాగించేందుకు సమంత అందించిన కారు ఎంతో ఉపయోగపడనుంది. కరోనా లాంటి కష్టకాలంలో బతుకు భారమైన కుటుంబానికి నేనున్నానంటూ సమంత అండగా నిలువడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ