సోమవారం 03 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 07, 2020 , 23:01:57

ఆర్థోపెడిక్ సేవ‌లను వినియోగించుకోవాలి

ఆర్థోపెడిక్ సేవ‌లను వినియోగించుకోవాలి

తిరుపతి: తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో ఉన్న సెంట్రల్‌ ఆస్పత్రిలో కొనసాగుతున్న ఆర్థోపెడిక్‌ సేవలను వినియోగించుకోవాలని బ‌ర్డ్ ఆస్పత్రికి చెందిన ఎముకల శస్త్ర వైద్య నిపుణులు డాక్టర్‌ చిత్తరంజన్‌  సాహు తెలిపారు. టీటీడీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సెంట్రల్ ఆస్పత్రిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కీళ్లు, ఎముకలకు సంబంధించిన వ్యాధులపై అవుటు పేషంట్‌ సేవలు పొందవచ్చని సూచించారు. టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 


logo