సోమవారం 30 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 03, 2020 , 18:10:09

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌

తిరుమల :కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ శ‌నివారం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా గ‌జేంద్ర సింగ్  షెకావ‌త్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టిటిడి సివిఎస్‌వో గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.