గురువారం 04 మార్చి 2021
Andhrapradesh-news - Jan 16, 2021 , 17:29:27

నరసాపురం, అనకాపల్లి నుండి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు

నరసాపురం, అనకాపల్లి నుండి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు

విజయవాడ : సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ డివిజన్‌ సికింద్రాబాద్‌కు రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. నరసాపురం నుంచి సికింద్రాబాద్‌కు అదేవిధంగా అనకాపల్లి నుంచి సికింద్రాబాద్‌కు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ వన్‌ వే రైళ్లు ఆదివారం ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు శనివారం వెల్లడించారు. ట్రైన్‌ నంబరు 07460 పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం నుంచి ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు బయల్దేరనుంది. సికింద్రాబాద్‌కు సోమవారం తెల్లవారుజామున 4.10 గంటలకు చేరుకోనుంది. భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల తదితర స్టేషన్లలో రైలు ఆగనుంది.

అదేవిధంగా ట్రైన్‌ నంబరు 07461 విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నుంచి ఆదివారం రాత్రి 8.50 గంటలకు బయల్దేరనుంది. సికింద్రాబాద్‌కు సోమవారం ఉదయం 8.50 గంటలకు చేరుకోనుంది. తుని, అన్నవరం, సామలకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్‌, కాజీపేట స్టేషన్లలో ఆగనుంది.   

VIDEOS

logo