సోమవారం 06 జూలై 2020
Andhrapradesh-news - Jun 30, 2020 , 08:52:00

ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకై ఇద్దరు మృతి

ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకై ఇద్దరు మృతి

విశాఖపట్నం : విశాఖలో మరోసారి గ్యాస్ కలకలం రేపింది. ఫార్మా కంపెనీలోని సైనారా కెమికల్స్‌లో రియాక్టర్ నుంచి రసాయన వాయువు లీక్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వాయువు పీల్చిన వారికి చికిత్స అందించేందుకు గాజువాక దవాఖానకు తరలించారు. వీరిలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. మృతులను షిప్ట్‌ ఇన్‌చార్జి నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వినయ్ చంద్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. మరో సారి గ్యాస్‌ లీక్‌ అవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


logo