శనివారం 06 మార్చి 2021
Andhrapradesh-news - Jan 27, 2021 , 20:04:42

కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ రెండో వార్షికోత్సవం

కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ రెండో వార్షికోత్సవం

తిరుమల: తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద ట్రస్ట్ సహకారంతో   పెద్దఎత్తున ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  బుధవారం కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయం ద్వితీయ వార్షికోత్సవంలో సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా పుణ్యాహవచనం ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. 

ఈ సందర్భంగా  ఛైర్మన్‌ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా కన్యాకుమారిలో ధార్మిక కార్యక్రమాలకు అంతరాయం కలిగిందన్నారు.  వివేకానంద ట్రస్ట్ టీటీడీకి చట్ట పరంగా భూమి అప్పగిస్తే కళ్యాణ మండపం నిర్మాణం ప్రారంభిస్తామని  చెప్పారు. భక్తుల కోరిక మేరకు కన్యాకుమారి ఆలయం ఆవరణంలో గరుడాళ్వార్ విగ్రహం ఏర్పాటు చేసే విషయం ఆగమ పండితులతో మాట్లాడి, రానున్న బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ముగిశాక తిరుమలకు గతంలో సాధారణ రోజుల్లో ఎంత సంఖ్యలో భక్తులను అనుమతించేవారో అంతకు ఆసంఖ్యను పెంచుతామని చైర్మన్ తెలిపారు.  

VIDEOS

logo