గురువారం 28 జనవరి 2021
Andhrapradesh-news - Nov 28, 2020 , 10:44:36

టీటీడీ పాలకమండలి సమావేశం

టీటీడీ పాలకమండలి సమావేశం

తిరుమల : కరోనా మహమ్మారి ప్రభావంతో తగ్గిన ఆదాయం, సిబ్బంది జీతభత్యాలు, ఆలయాల నిర్వహణకు నిధులు సమకూర్చుకోవడం వంటి కీలక అంశాలే ఎజెండాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం శనివారం జరుగనుంది. కరోనా మార్గదర్శకాల మేరకు భక్తుల సంఖ్య కుదించడంతో తగ్గిన ఆదాయాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో చర్చించనున్నారు. కార్పస్‌ఫండ్‌ నుంచి నిధుల డ్రా, భక్తుల దర్శనాలు, ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతించడంతో పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అనుమతించే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం తలుపులకు ఆరున్నర కిలోల బంగారంతో తాపడంతో పాటు మొత్తం 107 అంశాలపై భేటీలో చర్చ జరుగనుంది. సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్‌రెడ్డితో పాటు ధర్మకర్తలు, అధికారులు పాల్గొననున్నారు.


logo